కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా చైనాలో ఒమిక్రాన్ నుంచి పుట్టిన బీఏ 5.2 సబ్ వేరియంట్ విస్తరిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వేరియంట్ మామూలు ఒమిక్రాన్ వేరియంట్ కన్నా చాలా వేగంగా విస్తరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనాలో ఈ వేరియంట్ విస్తరిస్తుండటంతో భారీ స్థాయిలో టెస్టులను పెంచారు. అలాగే చైనా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.