బీజేపీ మాజీ చేనేత సెల్ రాష్ట్ర కన్వీనర్ చక్రధర్ ను పార్టీ నుంచి తొలగిస్తూ జిల్లా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి చక్రధర్ వివిధ కార్యక్రమాలు చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.