ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి అభివృద్ధికి శ్రీకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2017, 02:33 AM

- వేడుకగా స్టార్టప్‌ ఏరియా శంకుస్థాపనోత్సవం


- మందడం వద్ద 15న కార్యక్రమం


- రాజధాని రైతులకూ ఆహ్వానాలు


- సింగపూర్‌ కన్సార్టియంతో ఎంవోయూపై సంతకాలు


- కార్యక్రమానికి విస్తృత సన్నాహాలు


(వెలగపూడి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి) : అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ ఏరియాలోని 6.84 చదరపు కిలోమీటర్లలో స్టార్టప్‌ ఏరియాను మాస్టర్‌ డెవలపర్‌గా ఎంపిక చేసిన సింగపూర్‌ కన్సార్టియం (అసెండాస్‌- సింగ్‌బ్రిడ్గ్జ, సెంబ్‌కార్ప్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్గ) ద్వారా అభివ ద్ధి పరచే కార్యక్రమానికి ఈ నెల 15న శంకుస్థాపన జరగనుంది. రాజధాని గ్రామాల్లో ఒకటైన మందడం వద్ద ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పెద్దఎత్తున నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌, అసెంబ్లీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, పలువురు రాష్ర్ట మంు్తల్రు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు, ఏపీసీఆర్డీయే అధికారులు పాల్గొననున్నారు. సీఎం కోరిన వెంటనే అమరావతి నిర్మాణార్ధం వేలాది ఎకరాలను సమీకరణ ప్రాతిపదికన స్వచేందంగా అందజేసిన రాజధాని రైతులకు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారు. అపార ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సష్టించడంతోపాటు వివిధ పన్నుల్లో వాటా రూపేణా ప్రభుత్వానికి, పెరగబోయే భూముల విలువల రూపేణా అటు రాష్ర్ట ప్రభుత్వం, ఇటు రాజధాని రైతులకు భారీ లబ్ధి చేకూర్చాలన్నది ఈ స్టార్టప్‌ ఏరియా ప్రతిపాదన వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఇది అభివ ద్ధి చెందితే ఆ ప్రభావం అమరావతి అంతటిపై పడి, రాజధాని నగరం చకచకా నిర్మితమయ్యేందుకు బాటలు పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే స్టార్టప్‌ ఏరియాను స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో అభివ ద్ధి చేయించాలని నిర్ణయించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఈ విధానం వల్ల సింగపూర్‌ కన్సార్టియానికి వేల కోట్ల రూపాయల్లో లబ్ధి చేకూరనుండగా మౌలిక వసతుల కల్పనకు వేల కోట్ల రూపాయలను వెచ్చించే రాష్ర్ట ప్రభుత్వం (ఏపీసీఆర్డీయే)కు దక్కేది నామమ్త్రామేనని అవి ఆరోపణలు గుప్పించాయి. దీనిపై కొన్ని నిర్మాణ సంస్థలు హైకోర్టును సైతం ఆశ్రయించడంతో మాస్టర్‌ డెవలపర్‌ ఎంపిక ప్రక్రియలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు కోర్టుకేసులు ఈమధ్యనే ఒక కొలిక్కి రావడంతో స్టార్టప్‌ ఏరియా అభివ ద్ధిని శరవేగంగా సాగించేందుకు రాష్ర్ట ప్రభుత్వం సింగపూర్‌ కన్సార్టియాన్ని మాస్టర్‌ డెవలపర్‌గా ఎంపిక చేసినట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. వెన్వెంటనే దీనికి సంబంధించిన శంకుస్థాపనోత్సవాన్ని ఈ నెల 15న జరిపేందుకు నిర్ణయించింది. కాగా ఈ ఎంవోయూకు సంబం ధించిన చర్చల్లో కీలకప్త్రా పోషించిన రాష్ర్ట పురపాలక శాఖ మంత్రి, ఏపీసీఆర్డీ యే ఉపాధ్యక్షుడైన పి.నారాయణకు అనూహ్యంగా సంభవించిన ప్త్రుశోకం దష్ట్యా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. అయితే ఆహ్వానప్త్రంలో ఆయన పేరు ఉండడంతో ఆ ఒక్క రోజున నెల్లూరు నుంచి వచ్చి కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తారని భావిస్తున్నారు.


ఎంవోయూపై సంతకాలు సైతం : సోమవారం జరిగే కార్యక్రమంలో స్టార్టప్‌ ఏరియా అభివ ద్ధికి సంబంధించిన అవగాహనాప్త్రం (ఎంవోయూ)పై ఆంధ్రప్ర దేశ్‌, సింగపూర్‌ ప్రభుత్వాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. ఈ ఎంవోయూలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థాపరమైన, ఆర్ధికపరమైన ప్రగతికి సంబం ధించిన అంశాలు కూడా ఉండనున్నాయి. తద్వారా ఆ రోజున కుదుర్చు కోబోయే ఎంవోయూ ఒక్క అమరావతి స్టార్టప్‌ ఏరియాకే కాకుండా మొత్తంగా రాష్ట్రాభివ ద్ధికే చోదకశక్తిగా ఉపకరిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.


పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సీఆర్డీయే : రాష్ర్ట ప్రభుత్వంతోపాటు అమరావతి డిజైన్లపై మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌తో చర్చల నిమిత్తం ప్రస్తుతం లండన్‌లో ఉన్న తమ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఇస్తున్న ఆదేశా లను అనుసరించి శంకుస్థాపనోత్సవానికి సీఆర్డీయే అధికారులు పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు, రాజధాని రైతుల్లో ఎంపిక చేసిన కొందరికి అందజేసేం దుకు ఆహ్వానపత్రాలను రూపొందిస్తున్నారు. సుమారు 5 వేల నుంచి 10,000 మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్న అంచనాతో తదనుగుణంగా ప్రాంగణం, సభావేదికను సిద్ధం చేస్తున్నారు. అంకురార్పణ నుంచి ఇప్పటి వరకూ అమరావతి ప్రస్థానంలోని వివిధ ధశల గురించి తెలిపే ఛాయాచిత్రా లతో కూడిన ప్రదర్శనను సభాప్రాంగణంలోనూ, ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యత ద ష్ట్యా గన్నవరం విమానాశ్రయం నుంచి మందడం వరకూ వివిధ కూడళ్ల వద్ద రహదారికి పక్కన భారీ ఫ్లెక్సీలనూ ఏర్పాటు చేయనున్నారు. అడిషనల్‌ కమిషనర్‌ వి.రామమనోహరరావు నేతత్వంలో సీఆర్డీయే అధికారులు, సిబ్బంది పైన పేర్కొన్న సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com