ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిటికెలో సిద్ధమయ్యే మొలకల స్నాక్స్

Recipes |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 09:48 PM

కావలసిన పదార్ధాలు: మరమరాలు - ఒక కప్, నూనె - ఒక స్పూన్, జీలకర్ర - అరస్పూన్, పసుపు - చిటికెడు, బ్లాక్ సాల్ట్ - చిటికెడు, కారం - అరస్పూన్, దానిమ్మ గింజలు - అరకప్, శుభ్రంగా వలిచిన కమలా తొనలు -  6, సన్నగా తరిగిన టమాటో ముక్కలు - అరకప్, మొలకలు - అరకప్, సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు - అరకప్, చిన్న ముక్కలుగా కోసిన మామిడి పండు ముక్కలు - అరకప్, కొత్తిమీర తరుగు - కొంచెం, నిమ్మకాయ - 1, ఉప్పు - రుచికి సరిపడా. 


తయారీవిధానం:


-- ముందుగా మొలకలను కుక్కర్ లో వేసి ఉడికించి పెట్టుకోవాలి. 


-- స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టి నూనె వేసుకోవాలి. 


-- నూనె బాగా కాగాక జీలకర్ర వేయించి మరమరాలు వెయ్యాలి. 


-- రెండు నిమిషాలయ్యాక పసుపు, బ్లాక్ సాల్ట్, నార్మల్ ఉప్పు, కారం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 


-- ఇప్పుడు ఇందులో దానిమ్మ గింజలు, కమలా తొనలు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు, చిన్న ముక్కలుగా కోసిన మామిడి పండు ముక్కలు, కొత్తిమీర తరుగు, మొలకలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 


-- చివరిలో నిమ్మకాయ రసాన్ని పిండి సర్వ్ చేసుకుంటే సరి. సాయంత్రం పూట ఆరోగ్యకరమైన, రుచికరమైన స్నాక్స్ సిద్ధమైనట్టే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com