ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫాదర్స్ డే చరిత్ర ఇదే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 21, 2020, 05:12 PM

నాన్నంటే భయమే కాదు.. ఓ భరోసా. చిన్నప్పుడు చేయి పట్టి నడక నేర్పడమే కాదు. పెద్దయ్యాక మన కాళ్ల మీద మనం నిలబడే వరకు వెన్నంటే ఉండేది నాన్నే. మన జీవితం సుఖమయం కావాలని నిరంతరం కష్టపడేది నాన్న. పిల్లల భవిష్యత్ బంగారం కావాలని మనకు తెలియకుండా అనేక బాధలను దిగమింగుకునేది నాన్నే. నాన్నల త్యాగాలను గుర్తించుకునే రోజు ఫాదర్స్ డే. ప్రతీ సంవత్సరం జూన్ నెలలో మూడో ఆదివారాన్ని ఫాదర్స్‌డే గా జరుపుకుంటారు. అయితే ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకునే ఆనవాయితీ ఎలా మొదలైందో తెలుసుకుందాం.ఫాదర్స్ డేను మొదటిసారిగా అమెరికాలో జరుపుకున్నారు. 1910 జూన్ మూడో ఆదివారం నాడు వాషింగ్టన్ వైఎంసీఏలోని స్పోకేన్‌లో సోనోరా స్మార్ట్ డాడ్ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేశారు. అప్పుడు జూన్ 19న ఫాదర్స్ డే వచ్చింది. అయితే అప్పటికే ఏటేటా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సోనోరా తండ్రులకు కూడా ఓ రోజు ఉండాలని భావించింది. సోనోరా తండ్రి పేరు విల్లియం జాక్సన్ స్మార్ట్. ఆరుగురు పిల్లలకు తండ్రి. కష్టపడి ఆరుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. తన తండ్రి కష్టాలను, బాధ్యతల్ని దగ్గర్నుంచి చూసిన సోనోరా ఫాదర్స్ డే ఉండాల్సిందే అనుకున్నారు. ఈ విషయాన్ని చర్చ్ పాస్టర్‌తో చర్చించారు. తన తండ్రి పుట్టిన రోజు అయిన జూన్ 5న ఫాదర్స్ డే సెలబ్రేట్ చేయాలనుకున్నారు. కానీ చర్చి వేళలు కలిసిరాకపోవడంతో ఫాదర్స్ డే జూన్ మూడో ఆదివారానికి వాయిదా వేశారు. అలా ప్రతీ ఏడాది జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకొనే సంప్రదాయం అమెరికాలో మొదలైంది. ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ ఇదే రోజున పితృ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఫాదర్స్ డేను జరుపుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com