ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 15, 2019, 08:03 PM

శాసన మండలి సభ్యత్వా(ఎమ్మెల్సీ)నికి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశారు. శాసన మండలి ఇన్ ఛార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ రావుకు ఆయన తన రాజీనామా లేఖని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాసనసభకు పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు మంత్రి చంద్రమోహన రెడ్డి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com