కోలీవుడ్ సెలెబ్రిటీ కపుల్స్ లో సూర్య-జ్యోతిక దంపతులు ఒకరు. ఇటీవలే విక్రమ్ సినిమాలో రోలెక్స్ గా నటించి ప్రేక్షకులను మైమరిపించిన సూర్య, ప్రస్తుతం కోస్టారికా వెకేషన్ లో ఫ్యామిలీ తో కలిసి క్వాలిటీ టైం ను గడుపుతున్నాడు. జ్యోతిక సినిమాలను తగ్గించేసి, నిర్మాతగా మారి తన అభిరుచికి తగ్గ సినిమాలను రూపొందిస్తుంది. ఈ విషయాలు పక్కన పెడితే, తాజాగా సోషల్ మీడియాలో సూర్య కూతురు దియా హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్గా తమిళనాడులో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఇందులో దియా డిస్టింక్షన్ లో పాసవ్వడంతో ఆమె మార్క్స్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరూ కష్టంగా భావించే లెక్కల్లో దియా నూటికి నూరు మార్కులు తెచ్చుకుంది. అలానే ఇంగ్లీష్ లో 99, సైన్స్ లో 98, సోషల్, తమిళ్ లో 95 మార్కులు సాధించి మొత్తంగా 500 మార్కులకు గాను 487 మార్కులతో స్టేట్ లెవెల్ లో సత్తా చాటింది. సూర్య,జ్యోతిక అభిమానులు, నెటిజన్లు దియాకు అభినందనలు తెలియచేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.