స్టార్ సింగర్ చిన్మయికి సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఏరేంజులో ఉన్నారో, విమర్శకులు, ట్రోలర్లు కూడా అదే రేంజులో ఉన్నారు. ఏ విషయం మీదైనా ఎలాంటి భయం లేకుండా, ధైర్యంగా తన అభిప్రాయం చెప్పే చిన్మయి ఇటీవలే కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయంలో కూడా నెటిజన్లు ఆమెను ఊరికే వదల్లేదు. సరోగసినా లేక నిజంగా గర్భం దాల్చి కన్నావా ? అని విమర్శించారు. గతంలో సోషల్ మీడియాలో సంచలన వివాదానికి తెరతీసిన #metoo లో చిన్మయి కూడా తన గళాన్ని వినిపించింది. కొంతమంది తమిళ దిగ్గజాల పేర్లను సైతం పేర్కొంటూ, వారిపై యుద్ధానికి దిగింది.
కొంతమంది ఆకతాయిలు అసభ్యకర ఫోటోలను చిన్మయి కి DM ల ద్వారా సోషల్ మీడియాలో సెండ్ చేసేవారట. ఈ వ్యవహారం ఎప్పటినుండో నడుస్తుంది. దీనిపై ఇంస్టాగ్రామ్ సంస్థకు చిన్మయి రిపోర్ట్ కూడా చేసింది. కానీ, ఫైనల్ గా ఇంస్టాగ్రామ్ ఏం చేసిందో తెలుసా... చిన్మయి ఖాతానే తొలగించింది. ఆ ఆకతాయిల ఖాతాలను మెయిన్ టైన్ చేస్తుంది. ఈ విషయం తెలుపుతూ చిన్మయి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. ఇంస్టాగ్రామ్ విభిన్నధోరణికి జనాలు షాక్ అవుతున్నారు.