రజినికాంత్ హీరోగా నటించిన సినిమా 'చంద్రముఖి' అప్పట్లో సంచలనం విజయం సాధించింది. ఈ సినిమాకి పి. వాసు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సీక్వెల్ని రజినికాంత్ తో ప్లాన్ చేసారు కానీ కుదరలేదు. అయితే లారెన్స్ తో సినిమాకు సీక్వెల్ ను ప్లాన్ చేసాడు దర్శకుడు పి.వాసు. తాజాగా ‘చంద్రముఖి 2’ టైటిల్ను ఖరారు చేసి పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం.'చంద్రముఖి'లో ఉత్కంఠను రేకెత్తించే మేడపై గది పోస్టర్ను చూపిస్తూ టైటిల్ను ప్రకటించారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.