టాలీవుడ్ మోస్ట్ అడారబుల్ పెయిర్స్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, ఆయన భార్య ఉపాసన కామినేని జంట ఒకటి. ఇద్దరిదీ వేర్వేరు వృత్తులైనప్పటికీ ఎలాంటి అభిప్రాయభేదాలు లేకుండా చిలకాగోరింకల్లా పదేళ్ల నుండి కాపురం చేస్తున్నారు. ఏంటి? వీరి పెళ్ళయ్యి పదేళ్లయ్యిందా ? అని ఆశ్చర్యపోతున్నారా? అవును. జూన్ 14, 2012లో వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ రోజుతో వీరు దంపతులుగా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అరుదైన ఘట్టాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా సెలెబ్రేట్ చేసుకుందామని ఫారిన్ వెకేషన్ కెళ్లారు. వీరిద్దరి వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ రోజు పదవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా, చెర్రీ, ఉపాసనలు రాయల్ కపుల్ గా మురిసిపోయారు. ఈ ఫొటోల్లో హుందాగా ఉండే దుస్తులను ధరించిన ఈ ఇద్దరూ రాయల్ పెయిర్ గా ముచ్చట గొల్పుతున్నారు.