ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఠామేస్త్రి స్టెప్పును కొన్ని వందలసార్లు ప్రాక్టీస్ చేశాను - సాయిపల్లవి

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 11, 2022, 10:13 PM

టాలీవుడ్ హీరోయిన్లలో సాయిపల్లవి తీరు వేరు. గ్లామర్ కు దూరంగా ఉంటూ నటనకు ఆస్కారమున్న పాత్రలలో నటిస్తూ, స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను, లేడి పవర్ స్టార్ క్రేజ్ ను సంపాదించుకున్న ఏకైక హీరోయిన్ సాయి పల్లవి. ఆమె నుండి రావడానికి విరాటపర్వం మూవీ రెడీగా ఉంది. వేణు ఉడుగుల డైరెక్షన్లో రానా, సాయిపల్లవి జంటగా నటించిన విరాటపర్వం జూన్ 17న విడుదలవడానికి రెడీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంటే, మధ్యలో తెలుగు వచ్చేస్తుందని, దాంతో ఆమె కుటుంబ సభ్యులు సరదాగా తెలుగు కుర్రోడిని పెళ్లి చేసుకోమని అంటున్నారని చెప్పింది. డాన్స్ లో మెగాస్టార్ చిరంజీవి గారి స్టైల్, గ్రేస్ వేరే లెవెల్ అని కితాబిచ్చింది. ముఠామేస్త్రి సినిమాలో టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ ను వెయ్యటానికి చాలాసార్లు ప్రయత్నించానని చెప్పింది. హిట్లర్ సినిమాలోని అబిబ్బీ పాట మెగాస్టార్ గ్రేస్ అయితే చాలా ఇష్టం అది అది ఎవరికీ రాదు అని చిరు డాన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com