సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించిన "పుష్ప" దేశవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప మ్యానరిజమ్స్, హుక్ స్టెప్పులు, సాంగ్స్...అన్ని జనాలకు వైరస్ లా పట్టి వదలకుండా పీడిస్తున్నాయి. ఇప్పటికి సోషల్ మీడియాలో పుష్ప రీల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ ను గ్రాండ్ గా తీసుకొచ్చింది. దీంతో వెంటనే పుష్ప 2 పనులను స్టార్ట్ చేసేసిన బన్నీ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. పుష్ప 2 ప్రీ ప్రొడక్షన్ పనులను చక్కబెట్టడంలో సుకుమార్ బిజీగా ఉన్నారు. జులై నుండి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్తుందని చిత్రసీమలో వార్తలు వినబడుతున్నాయి. ఈ విషయం పక్కన పెడితే, బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టు పై అంతటా ఆసక్తి నెలకొంది. పుష్ప సినిమా తర్వాత కొరటాలతో సినిమాను ఎనౌన్స్ చేసిన బన్నీ ప్రస్తుతం తన ఇంటరెస్ట్ నంతా పుష్ప 2 పై పెట్టడంతో కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేసుకుంటున్నాడు. ఊఁ అనలే కానీ, తమిళ్ డైరెక్టర్ మురుగదాస్, త్రివిక్రమ్, కొరటాల వంటి వారు వెంటనే బన్నీతో సినిమా చెయ్యటానికి రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టు పై అధికారిక సమాచారం దసరా పండుగ రోజున రానున్నట్టు టాక్.