తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సర్వదర్శన ఆన్లైన్ టికెట్లను టీటీడీ విడుదల చేసింది. డిసెంబర్ నెల టికెట్లను టీటీడీ శనివారం ఉదయం 9 గంటలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటీపీ, వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్లను కేటాయిస్తున్నారు. రోజుకు 10 వేల టికెట్ల చొప్పున డిసెంబర్ నెల కోటాను టీటీడీ విడుదల చేసింది. కాగా, విడుదల చేసిన 10 నిమిషాల్లో వెబ్సైట్లో దర్శన టికెట్లు ఖాళీ అయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు డిసెంబర్ నెలకు సంబంధించి అద్దె గదుల కోటా టికెట్లను విడుదల చేయనున్నారు.