పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. కొత్త పోకో ఫోన్ హోల్ పంచ్ డిస్ ప్లే, వెనకవైపు నాలుగు కెమెరాలతో లాంచ్ అయింది. ప్రో కలర్ మోడ్, ప్రో వీడియో మోడ్, రా మోడ్ వంటి కెమెరా ఫీచర్లు ఇందులో ముందుగానే ఉన్నాయి. పోకో బ్రాండ్ లో వచ్చిన మూడో ఫోన్ ఇది. ఇందులో 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఇందులో మొత్తం మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గానూ నిర్ణయించారు. అవుట్ ఆఫ్ ద బ్లూ, గ్రీన్ అండ్ గ్రీనర్, టూ షేడ్స్ ఆఫ్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన సేల్ ఫ్లిప్ కార్ట్ లో ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 5 కూడా ఇందులో ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ పై పోకో ఎం2 ప్రో పనిచేయనుంది. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్కవైపు అందించారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లు కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.