ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారమే అండగా రెచ్చిపోతున్న ఎమ్మెల్యేలు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2017, 12:48 AM

  మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధి : అధికారమే అండగా తెలంగాణలోని కరీం నగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. తమ అవినీతి అక్రమాలతో కోట్లాది రూపాయలను వెనకేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల నాటికి కోట్ల రూపాయాల సంపాదనే లక్ష్యంగా ముందుకు పోతు న్నారు. మొత్తం ఐదుగురు శాసనసభ్యులు తమ నియోజకవర్గాలను రాజరిక పాలనకు కేంద్రంగా తీసుకున్నారు. తమ అనుమతులు లేకుండా చీమ కూడ కదలడానికి వీలు లేదంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మిషన్‌ కాకతీయ పనులలో కాంట్రాక్టర్లను రింగ్‌ చేసి పర్సంటేజిల పనులకు ఇద్దరు ఎమ్మెల్యేలు శ్రీకారం చుడితే  తన అనుచరులను బినామీలుగా చేసుకుని మరో ఎమ్మెల్యే చక్రం తిప్పుతున్నారు. అన్ని పనులు తానే చేసే విదంగా పక్కా ప్రణా ళిక తయారు చేసుకున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల ఆగడాలు మితిమీరిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గతంలో రెండు సార్లు వివిధ పార్టీల నుండి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయి తొలిసారి అసెంబ్లీ లోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే ఒకరు అయితే ఉద్యమాల ద్వారా రాజకీయ ఆరంగ్రేటం చేసిన మహిళా ఎమ్మెల్యే మరొకరు. కెసిఆర్‌ సామాజిక వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయిన తన నియోజకవర్గ కేంద్రాన్ని అవినీతి అడ్డాగా మార్చుకున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయిన వారే కావడం విశేషం. వీరిలో కూడ ఒకరు మహిళా శాసనసభ్యురాలు కాగా మరోకరు అణగారిన వర్గాల నుండి ఎన్నికయిన ఎమ్మెల్యే ఉన్నారు. వీరిద్దరు కూడ  పనుల అంచనాలను ఇష్టం వచ్చినట్లుగా తయారు చేస్తూ ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసేందుకు అపసోపాలు పడుతున్నారు.  మరో నూతన గిరిజన ఎమ్మెల్యే కూడ అనేక వివాదాలలో తలదూరుస్తున్నారు. తన నియోజకవర్గంలో భూములకు సంబందించి ఈ రెండేళ్ల కాలంలో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. వీరందరి అవినీతి పై రాష్ట్ర ఇంటలిజెన్సు విభాగం ఎప్పటికపుడు సిఎం కెసిఆర్‌కు నివేదికలు అందిస్తుంది. ఏడాది కాలంగా వీరి పనితీరును గమనిస్తున్న కొందరిని తీవ్రంగా మందలించి పద్దతి మార్చుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. మరికొందరికి మాత్రం అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకు కూడ నిరాకరిస్తున్నట్లు సమాచారం. 


ఇసుక అక్రమ రవాణా కేంద్రంగా ఆ ఎమ్మెల్యే నియోజకవర్గం


   కరీంనగర్‌ జిల్లాలోని తూర్పు అటవీ ప్రాంతంలో ఆ నియోజకవర్గ కేంద్రం ఉంటుంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బడా నేతను ఓడించాడన్న కారణంగా కొత్తలో సిఎం కెసిఆర్‌ ఆ ఎమ్మెల్యేకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ గడిచిన రెండేళ్ల కాలంలో ఆయన తన అసలు రూపాన్ని ప్రదర్శించారు. రెండు సార్లు ఓటమి పాలైన సదరు ఎమ్మెల్యే తన నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్న భూములపై కన్నేశారు. నియోజకవర్గ కేంద్రంలోని పలు భూములపై కన్నేసి  చౌకధరకు వాటిని కొట్టేశారనే ఆరోపణలున్నాయి.గోదావరి నది ఒడ్డునే తన నియోజకవర్గం ఉండడంతో ప్రతి ఏడాది కోట్లాది రూపాయల విలువ చేసే ఇసుక రవాణా జరుగుతుంది. ఇందులో జరిగే టెండర్లలో అనేక అవకతవక లకు పాల్పడుతున్న సదరు ఎమ్మెల్యే నెల నెల మాముళ్లు వసూల్‌ చేస్తున్నారని సమాచారం. తనకు డబ్బులు ఇవ్వకుండా ఒక్క వాహనం కూడ కదిలేది లేదంటూ ఆయన భీష్మించు కూర్చున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు తన నియోజకవర్గ పరిధిలో జరిగే ప్రభుత్వ పనులలో కూడ పర్సంటేజిలు వసూల్‌ చేస్తున్నారని టాక్‌. ఈ ఎమ్మెల్యే వ్యవహర శైలిపై సిఎం కెసిఆర్‌ కు అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో పద్దతి మార్చుకోవాలని ఆయన హెచ్చరించినప్పటికి సదరు ఎమ్మెల్యే వైఖరిలో మార్పు రాలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.


మైనింగ్‌ మాఫియా వద్ద మాముళ్లు వసూల్‌ చేస్తున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు


    కరీంనగర్‌ జిల్లాలో ప్రభుత్వం చేపట్టే అన్ని ప్రభుత్వ పనులలోను ఇద్దరు ఎమ్మెల్యేలు చ్ర ం తిప్పుతున్నారు. నెల నెల మైనింగ్‌ మాఫియా వద్ద నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు మాముళ్లు వసూల్‌ చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్‌లు జరుగుతున్న వీరు మాత్రం పట్టించుకోవడం లేదు. తమకు ముడుపులు ఇవ్వని వారిపై జులుం ప్రద ర్శిస్తున్నారు. వీరిలో  నూతనంగా అసెంబ్లీకి ఎన్నికయిన ఓ మహిళా ఎమ్మెల్యే కూడ ఉన్నారు. మరో ఎమ్మెల్యే సిఎం సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం.  వీరి నియోజకవర్గాలలో చేపట్టే అభివృద్ది పనులకు సంబందించి ఇష్టం వచ్చినట్లుగా ఎస్టిమేషన్‌ రూపొందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీరి వ్యవహర శైలిపై ఇప్పటికే ఇంటలిజెన్సు నివేదికను రూపొందించి సిఎం కెసిఆర్‌ కు అందించిందని సమాచారం.  లిక్కర్‌ లోను మాఫియా అవతారం ఎత్తారని, వీరి అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.


పార్టీ పరువును బజారున పడేస్తున్న శాసనసభ్యులు


రాజకీయ అవినీతి అంతానికి సిఎం కెసిఆర్‌ చర్యలు తీసుకుంటుంటే ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అవినీతిలో బరితెగించారు. మిషన్‌ కాకతీయ పనులలో కాంట్రాక్టర్లతో సమావేశమైన ఓ ఎమ్మెల్యే ఇష్టం వ చ్చినట్లు టెండర్‌ వేయరాదని గుత్తేదార్లను ఆదేశించారు. తనకు, తన అనుచరులకు ఖచ్చితంగా పర్సంటేజిలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌లోని తూర్పు ప్రాంతానికి చెందిన సదరు ఎమ్మెల్యే తీరుపై గతంలోనే అనేక విమర్శలు వచ్చాయి.ప్రభుత్వ అధికారిని ఇంటికి పిలిచి బెదిరించారన్న ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు. ఇదే జిల్లాకు చెందిన మరో మహిళా ఎమ్మెల్యే వ్యవహర శైలిపైన అనేక విమర్శలు వస్తున్నాయి. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగిగా ఉండడం విశేషం. తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులో పర్సంటేజిలు ఇవ్వకుంటే బిల్లులు ఇచ్చేది లేదంటూ భీష్మించు కూర్చున్నారు. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయిన సదరు మహిళా ఎమ్మెల్యే  వైఖరిపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆగ్రహంగా ఉన్నార ని సమాచారం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com