ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదవులపై రాజుకున్న అగ్గి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 03, 2017, 01:28 AM

అమరావతి-సూర్య ప్రధాన ప్రతినిధి: మంత్రి పదవులపై అగ్గి రాజకుంది. పదవులు దక్కని నేతలు ఇన్నాళ్లూ బిగ్గపట్టుకుని ఉన్న తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో తమ నాయకులకు పదవులు దక్కలేదంటూ పలువురు నేతలు రాజీనామాలు చేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకుని పార్టీలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్‌ నేత సైతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయారాం...గయారంలకు పార్టీ నిలయంగా మారిందన్న వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. మరోవైపు తొలిసారి ఎమ్మెల్యే అయిన బొండా ఉమ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన తరువాత కాస్త మెత్తబడ్డారు.  మరో సీనియర్‌ నేత అయిన ధూళిపాళ్ల నరేంద్రకు కూడా మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వారు కూడా మంత్రి పదవులపై ఆశపడడం భావ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. విశాఖపట్నంకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే సైతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.


తొలిసారే మంత్రి పదవి అడగటం భావ్యమా? 


టీడీపీలో క్రమశిక్షణ ముఖ్యం తొలిసారి ఎమ్మె ల్యేగా గెలిచి మంత్రి పదవి అడగటం భావ్య మా? అని విజయవాడ సెం్టల్‌ ఎమ్మెల్యే బొండా ఉమాతో సీఎం చంద్ర బాబు వ్యాఖ్యానించి నట్లు తెలిసింది. మంత్రి పదవి దక్కలేదని అసంత ప్తి వ్యక్తం చేసిన బొండా ఉమాను ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ బుజ్జగించి సీఎం వద్దకు తీసుకెళ్లారు. కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వంలో ఉన్న ప్రాధాన్యతను బొండాకు వివరించిన సీఎం చంద్రబాబు ఆ సామాజికవర్గం నుంచి ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చామని గుర్తు చేశారు.


ఎందుకంత తొందర.. బోండా ఉమాపై బాబు ఆగ్రహం


మ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇవ్వకపోతే ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తారా? అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే అయి మూడు సంవత్సరాలు కాలేదు.. అప్పుడే అలక ఏంటని, చాలా మంది సీనియర్లకే పదవులు దక్కలేదని, అందరూ మీలాగే చేస్తున్నారా అని బోండా ఉమాను చంద్రబాబు ప్రశ్నించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారని, మంత్రి పదవికి అప్పుడే అంత తొందర ఎందుకని బోండాతో చంద్రబాబు అన్నట్లు సమాచారం. బోండా ఉమాకు చెందిన పలు కబ్జా వివాదాలను చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆర్టీఏ గన్‌మెన్‌పై దాడి అంశాన్ని గుర్తుచేస్తూ అందరి చిట్టాలు తన వద్ద ఉన్నాయని సీఎం చంద్రబాబు హెచ్చరించినట్లు సమాచారం. టీడీపీకి క్రమశిక్షణే ముఖ్యమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తే సహించేది లేదని కాస్త ఘాటుగానే బోండా ఉమాకు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. కాపులకు టీడీపీ ఇచ్చినన్ని పదవులు ఏ పార్టీ కూడా ఇవ్వలేదని, విధేయతతో పనిచేస్తే పదవులు వెతుక్కుంటూ వస్తాయని బోండా ఉమాకు చంద్రబాబు హితబోధ చేశారు.


సీఎం చెప్పిన మాటతో సంతం ప్తి చెందా...బొండా ఉమా


సీఎం చంద్రబాబుతో విజయవాడ సెం్టల్‌ ఎమ్మెల్యే బొండా ఉమా భేటీ ముగిసింది. మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్క పోవడంపై అసంతప్తి వ్యక్తం చేసిన బొండా ఉమా సీఎం చంద్రబాబును కలిసిన అనం తరం మెత్తబడ్డారు. తొలుత అసంతప్తిగా బొండా ఉమాను ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ బుజ్జగించి సీఎం వద్దకు తీసుకెళ్లారు. సీఎంతో సమావేశం అనంతరం బొండా మాట్లాడుతూ మంత్రి పదవి దక్కలేదని బాధపడ్డానని, పార్టీకి సేవలందించిన వారందరికీ మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోయామని చంద్రబాబు చెప్పారని, ఆయన చెప్పిన మాటతో సంతప్తి చెందానని బొండా ఉమా తెలిపారు.


పార్టీ పదవికి బుచ్చయ్యచౌదరి రాజీనామా: తెలుగుదేశం పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయని, అందుకే పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపిచినట్లు చెప్పారు. పార్టీలో మొదటి నుంచి నమ్ముకున్న, త్యాగాలు చేసిన వారికి గుర్తింపు లభించడం లేదని, ఆయారాం, గయారాంలకు పదవులు దక్కుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఐదుసార్లు గెలిచిన తాను మంత్రి పదవి ఆశించానని, పార్టీలు మారిన వారికి అందలమెక్కించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక సంక్షోభాల్లో తన సేవలను పార్టీ వినియోగించుకుందన్నారు. ఎన్టీఆర్‌, పుచ్చలపల్లి సుందరయ్య సూేర్తితో తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని బుచ్చయ్యచౌదరి చెప్పారు.


కలిసి పనిచేద్దాం: కాల్వ : కొత్తగా మంత్రి పదవి చేపట్టిన కాల్వ శ్రీనివాసులు మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ను కలిశారు. ప్రజా సమస్యలపై కలిసి పనిచేద్దామని చెప్పారు. అయితే తనకూ, దూళిపాళ్ల నరేంద్రకు కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై పయ్యావుల అసంతప్తి వ్యక్తం చేశారు. అయితే పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేశారు. కలిసి పని చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరంలేదని పయ్యావుల కాల్వకు తెలిపారు.


చంద్రబాబుతో సహా నేనూ గాయపడ్డా : బొజ్జల


ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గంలోంచి తనను తొలగించడంపై చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకష్ణ తన స్పందన తెలియజేశారు. ‘నాకు ఆరోగ్యం బాగా లేదన్న మాట వాస్తవమే. నడవలేని దుస్థితిలో లేను. చికిత్స తీసుకుంటున్నా. అనారోగ్య కారణాలతో మంత్రి పదవికి పనికిరాకపోతే ఎమ్మెల్యే పదవికి కూడా పనికిరాననుకున్నా. అందుకే రాజీనామా చేశా.’ అని బొజ్జల వివరించారు. చనిపోయేంతవరకు ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉందని తన మానసులో మాటను బొజ్జల బయటపెట్టారు. వైసీపీలోకి వెళ్తున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. అనారోగ్యం కారణంగానే మంత్రి పదవి నుంచి తొలగించడంపై తనకు అసంతప్తి లేదని, అలాగే సంత ప్తి కూడా లేదని బొజ్జల అన్నారు. సీఎం చంద్రబాబు తనతో ఫోన్‌లో మాట్లాడిన విషయాలు బయటకు చెప్పడానికి ఆయన నిరాకరించారు. చంద్రబాబుతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ ‘అలిపిరి దాడిలో చంద్రబాబుతో సహా నేనూ గాయపడ్డా. ఆ తర్వాత హార్ట్‌ ఎటాక్‌, కేన్సర్‌ వచ్చింది. ప్రస్తుతం పార్కిన్‌సన్‌కు చికిత్స పొందుతున్నా. ఆరోగ్యం విషయంలో నేను జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావించి ఉండొచ్చు.’ అని బొజ్జల పేర్కొన్నారు. తన కుమారుడిని రాజకీయాల్లో ప్రోత్సహించడం కోసం తనను తప్పించారనే ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. తాను అలా భావించడం లేదని, ఎవరినైనా ప్రజలే ఆదరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ నుంచి దూతలు వస్తున్నారని, ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని బొజ్జల తెలిపారు.


కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల మూకుమ్మడి రాజీనామా


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ టీడీపీలోని చాలా మంది ఎమ్మెల్యేల్లో నిరాశను నింపింది. తమకు ఈసారైనా కేబినెట్‌లో చోటు దక్కుతుందని చాలా మంది ఎమ్మెల్యేలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కొత్త మంు్తల్ర జాబితాలో తమ పేరు లేకపోవడంతో నిరాశకు గువుతున్నారు. క ష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు నివాసంలో నాలుగు మండలాల టీడీపీ నేతల సమావేశమయ్యారు. వెంకట్రావుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంత ప్తి వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా పెడన, గూడూరు, బంటుమిల్లి, క త్తివెన్ను మండలాలకు చెందిన నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బోండా ఉమ తనకు కేబినెట్‌ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అలక చెందారు. సీఎం చంద్రబాబుతో సమావేశమయిన అనంతరం ఆయన అలక వీడారు.


ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా: ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అధిష్టానం కనికరించలేదని పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ వాపోయారు.ఆంధ్ర ప్రదేశ్‌ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో తనకు పదవి దక్కకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంత ప్తి వ్యక్తం చేశా రు. తన తండ్రికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదో చెప్పాలని శివాజీ కుమార్తె, శ్రీకాకుళం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష డిమాండ్గ చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన తండ్రికి మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు. కనీసం ఆయన పేరు పరిశీలనలోకి తీసుకోరా అని ప్రశ్నించారు. పార్టీని నమ్ముకుంటే అన్యాయం చేస్తారా అని సూటిగా నిలదీశారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఆమె భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.


ధూళిపాళ్ల నరేంద్రకు అన్యాయం: ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ అధికార టీడీపీలో తీవ్ర అసంత ప్తికి దారి తీసింది. మంత్రి పదవులు దక్కకపోవడంతో పార్టీ సీనియర్లు బహిరంగంగానే అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయా నాయకుల మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. ధూళిపాళ్ల నరేంద్రకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన మద్దతుదారులు గుంటూరు జిల్లా చింతలపూడిలో రాస్తారోకో చేశారు. మరోవైపు ధూళిపాళ్ల నివాసం వద్ద కార్యకర్తలు నిరసనకు దిగారు. పార్టీకి రాజీనామా చేయాలని ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ధూళిపాళకు అన్యాయం చేశారంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు అభీష్టం మేరకు ఆయన రాజీనామాకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. దూళిపాళ్లను బుజ్జగించేందుకు అధిష్టానం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆయనను బుజ్జగించే బాధ్యత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డికి అప్పగించినట్టు సమాచారం.


అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల రాజీనామా లేఖలు


మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణలో తమ ఎమ్మెల్యేకు కేబినెట్‌ పదవి దక్కకపోవడంతో పెనుకొండలోని టీడీపీ నేతలు రాజీనామాలకు సిద్ధమ య్యారు. అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే బీకే పార్థసారధికి మంత్రి పదవి ఖాయమని ఆయన వర్గీయులంతా కోటి ఆశలు పెట్టుకున్నారు. మొదటి వర్గీకరణలోనే తమ నేతకు మంత్రి పదవి దక్కుతుందనుకున్న తమకు అప్పట్లో నిరాశ ఎదురయిందని, కానీ, ఇప్పుడు దాదాపు ఖరారైపోయిందనుకుంటే మళ్లీ నిరాశే ఎదురైందని వాపోతున్నారు. తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా రాజీనామాలు చేశారు. అనంతపురం జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి దండు ఈశ్వరప్రసాద్‌, సోమందేపల్లి మండలాధ్యక్షురాలు దాసరి వరలక్ష్మి, పాలసముంద్రం ఎంపీటీసీ శారదాబాయి తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి కంటే ముందు పెనుకొండ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ వెంకటరాంరెడ్డి, రొద్దం సింగిల్‌ విండో ప్రెసిడెంట్‌ టైలర్‌ ఆంజినేయులు, పరిగి ఎంపీపీ సత్యనారయణలు తమ పదవులకు రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది.


అజ్ఞాతంలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే?: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణతో అధికార టీడీపీలో అసంత ప్తి భగ్గుమంది. సీనియర్లను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులు కట్టబెట్టడంతో టీడీపీ నాయకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసిన వారిని కాదని కొత్తగా వచ్చిన వారిని కేబినెట్‌ లోకి తీసుకోవడంతో అలకబూనారు. మంత్రి పదవి రాలేదన్న అసంత ప్తితో పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. తమ నాయకుడికి మంత్రి పదవి రాలేదన్న విషయం తెలుసుకున్న మద్దతుదారులు సత్యనారాయణమూర్తి స్వగ్రామం వెన్నెలపాలెంకు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com