ఓ లారీ అదుపు తప్పి వాగులోకి పడింది. ఈ ఘటన అనంతరపురం జిల్లాలోని ముదిగుబ్బ మండలం దొరిగిల్లు వద్ద జిల్లెడువాగులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దొరిగిల్లు మీదుగా పులివెందులకు వెళ్తున్న ఓ లారీ.. జిల్లెడువాగు దాటుతూ అదుపు తప్పి కిందకు పడిపోయింది. ప్రమాదం నుంచి డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.