ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 10 వేలు కడితే కారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 04:29 PM

కరోనాతో పబ్లిక్ ట్రాన్స్ పోర్టు, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. దీంతో సొంత వాహనాలకు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ తరుణంలో వినియోగదారులు కేవలం రూ. 10 వేలు చెల్లిస్తే హోండా అమేజ్‌కారును తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు. మరోవైపు, ఎంపిక చేసిన మోడళ్లపై హోండా కార్స్ ఇండియా 1 లక్షల రూపాయల తగ్గింపును అందిస్తోంది. సంస్థ అన్ని ఆఫర్లు 30 జూన్ 2020 వరకు చెల్లుబాటులో ఉంటాయని తెలిపింది. వినియోగదారులు రూ. 10 వేలు చెల్లించి హోండా అమెజ్ ను కొనొచ్చు.సంస్థ ట్వీట్ ప్రకారం, హోండా అమేజ్ కొనుగోలుపై కంపెనీ అనేక ఆఫర్లను అందిస్తోంది. అమేజ్ సంస్థ కొనుగోలుపై, ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాలు వినియోగదారుడికి అందుబాటులో ఉన్నాయి. కనీస ఈఎంఐ లక్షకు రూ .1432 ఉంటుంది. 8.35 శాతం వడ్డీ రేటుతో రుణం లభించనుంది. ఈ ఆఫర్ కింద వాహనానికి 100 శాతం ఆన్-రోడ్ ఫండింగ్ ఉంటుంది. రుణం తిరిగి చెల్లించడానికి గరిష్టంగా 8 సంవత్సరాల సమయం లభించనుంది. ఇది కాకుండా, అమేజ్ పై 5 సంవత్సరాల అపరిమిత వారంటీ, 3 సంవత్సరాల హోండా కేర్ మెయింటెనెన్స్ ప్రోగ్రాంను కంపెనీ అందించనుంది.


అమేజ్ పై అందించే ఆఫర్..


మీరు పాత కారును మార్పిడి చేయడం ద్వారా BS6 పెట్రోల్ / డీజిల్ హోండా అమేజ్ కొనుగోలు చేస్తే మీకు రూ. 12 వేల పొడిగించిన వారంటీ (నాల్గవ, ఐదవ సంవత్సరం), రూ. 20 వేల అదనపు తగ్గింపు లభిస్తుంది. కారు మార్పిడి చేయకపోతే, హోండా కేర్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం రూ. 12 వేల పొడిగించిన వారంటీ (నాల్గవ, ఐదవ సంవత్సరం), ఇక కొత్త అమేజ్ కొనుగోలుపై 50% ఖర్చుతో ప్రయోజనం పొందవచ్చు. హోండా అమేజ్ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ .6.09 లక్షలతో ప్రారంభం అవుతుంది.


హోండా సిటీపై..


బీS6 పెట్రోల్ హోండా సిటీపై రూ. 25 వేల వరకు నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 20 వేల అదనపు తగ్గింపు లభిస్తుంది. పెట్రోల్ హోండా సిటీ విఎక్స్ ఎంటీ-బీఎస్ 6 పై రూ. 37000 వరకు నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ .35000 అదనపు తగ్గింపు ఉంది. పెట్రోల్ వీఎక్స్ సీవీటీ/ జెడ్ఎక్స్ ఎంటి / జెడ్ఎక్స్ సీవీటీ- బీఎస్ 6 హోండా సిటీలో రూ .50000 వరకు నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ .50000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. హోండా సిటీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ .9.91 లక్షల నుంచి ప్రారంభం కానుంది.


మీ దగ్గరలోని హోండా కారు షోరూంలలో సంప్రదించవచ్చు. లేదా ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. Book Now: bit.ly/Honda_From_Home






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com