విశాఖపట్నం: కోస్తాలో శుక్రవారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గురువారం తేలికపాటి వర్షాలు కురిశాయి. కాగా తూర్పు, ఈశాన్యం నుంచి వీస్తున్న గాలులతో రాగల రెండు, మూడు రోజులు అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణ నెలకొంటుందని అంచనా వేస్తోంది.