ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ పేరుతో వైన్ షాపు గత కొన్నేళ్లుగా నడుస్తొంది. నిజమే మీరు వింటోంది. నేటితో లైసెన్స్ పూర్తి చేసుకున్న ఈ వైన్ షాప్ గురించి సామాజిక మీడియాలో వార్త హల్చల్ చేస్తోంది. తెలంగాణ సీఎం పేరు ఇలా మద్యం షాపుకి పెట్టారేంటి అని మీరు అనుకోవచ్చు కానీ ఇది వాస్తవమే. ఆ వివరాలలోకి ఓ సారి తొంగి చూస్తే, నెల్లూరు జిల్లాలోని వాకాడు మండలం తూపిలిపాలెం అనే మత్స్యకార గ్రామంలో కేసీఆర్ వైన్ షాప్ అనే పేరుతో గత కొంత కాలంగా నిర్వహిస్తున్నారు. ఈ షాపుకు ఈ పేరు పెట్టడం వెనుక కథేమీ లేదు. షాపు యజమాని వైసీపీ అభిమాని కావడంతో పార్టీ జెండాలోని మూడు రంగులు కన్పించేలా బోర్డులో పెట్టించారు. అయితే సదరు షాప్ లైసెన్స్ యజమాని పేరు కె.చెంగారెడ్డి కావడంతో తన పేరుతోనే ఇలా కేసీఆర్ అని షాపుకు పెట్టుకున్నారట.... అదండీ విషయం.