గ్రామ సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన వేదికపై జగన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఏపీ మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై ప్రశంసలు జల్లు కురిపించారు . ఇప్పటి వరకు వైయస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఉన్న వారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులయ్యా రంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు పొందినవారంతా జగన్ ను రోజూ పూజించాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడిలా జగన్ ఉద్యోగాలు ఇచ్చారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దేశానికి స్వర్ణయుగం గుప్తుల కాలమైతే ఏపీకి ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందంటూ తెగ పొగిడేశారు. అధికారం చివరి రోజుల్లో మేనిఫెస్టోను అమలు చేసే ప్రభుత్వాలనే చూశామని కానీ సీఎం జగన్ అందుకు విరుద్ధంగా మెుదట్లోనే అమలు చేసి రికార్డు సృష్టించారంటూ రాజకీయ పరమైన వ్యాఖ్యలు సైతం చేసేశారు.