ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 09:22 PM

వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని, కూటమి అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తోందని జనసేన ఏపీ ప్రధాన కార్యదర్శి తమ్మారెడ్డి శివశంకర్‌రావు ఆరోపించారు. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై అసభ్యకరంగా కామెంట్స్ చేశారని పేర్కొన్నారు. జనసేన తరఫున సీఈఓ ముకేష్ కుమార్ మీనాను కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయని స్పష్టం చేశారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com