ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలాలు 17-03-2024: ఆదివారం

Astrology |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2024, 12:05 PM

మేషం
దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి కొంత బాధిస్తుంది. బంధు వర్గంతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
వృషభం
ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధు వర్గంతో మాటపట్టింపులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కష్టం తప్ప ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి.
మిథునం
చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసివస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
కర్కాటకం
ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. దూరప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.
సింహం
కుటుంబ సభ్యులతో శుభకార్యలకు హాజరువుతారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్కు ఉపయోగపడతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంతనానికి నూతన విద్యా ఉద్యోగఅవకాశములు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కన్య
ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంటా బయట పరిస్థితులు ప్రతికూలిస్తాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
తుల
వ్యాపారమున స్వంత ఆలోచనలు అమలు చేస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు.
వృశ్చికం
ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నూతన విషయాలు సేకరిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
ధనస్సు
బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగమున శ్రమాదిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి.
మకరం
చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
కుంభం
ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. రాజకీయ సభ, సమావేశాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి.
మీనం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. ఆప్తుల నుంచి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com