ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5న అయ్యప్పస్వామి కర్పూర నగరోత్సవం

Bhakthi |  Suryaa Desk  | Published : Sat, Dec 03, 2022, 01:32 PM

వేటపాలెం ఆణుమల్లిపేటలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో సోమవారం 44వ కర్పూర నగరోత్సవం నిర్వహించనున్నట్లు అయ్యప్పస్వామి దేవస్థాన కమిటీ ప్రతినిధులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం గ్రామంలో కలశం, నగలు ఊరేగింపు చేసిన అనంతరం ఆలయంలో గణపతి హోమం, స్వామివారికి అభిషేకాలు జరుగుతాయని చెప్పారు.


రాత్రి 7గంటలకు స్వామి వారి కర్పూర నగరోత్సవం విచిత్ర వేషధారణలతో, బాలికలచే జ్యోతులతో, అయ్యప్పస్వాముల శరణుఘోషలతో జరుగుతుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం చద్ది, రాత్రి భిక్ష ఏర్పాటు చేశామని, పరిసర ప్రాంత మాలాధారణ భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని అయ్యప్పస్వామి దేవస్థాన కమిటీ, మణికంఠ యువజన సంఘం, మాలికాపురత్తమ్మ తల్లి మహిళా సంఘం ప్రతినిధులు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com