ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రింటెడ్ శారీలో అట్రాక్ట్ చేస్తున్న ప్రియమణి

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2024, 10:48 AM

సీనియర్ నటి ప్రియమణి చీరకట్టులో బ్యూటీఫుల్ గా మెరిసింది. రోజురోజుకు మరింత అందంగా కనిపిస్తూ కట్టిపడేస్తోంది. తాజాగా పంచుకున్న ఫొటోలు ఇలా ఉన్నాయి.టాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణికి తెలుగు ప్రేక్షకులల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఎన్నో సినిమాల్లో నటించి ఇక్కడ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే.తెలుగు ఆడియెన్స్ లో ప్రియమణికి మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోల సరసన నటించిన ఈ సీనియర్ బ్యూటీ అభిమానులను సంపాదించుకోవడంతో పాటు నటిగా గుర్తుండిపోయే సినిమాల్లో విభిన్న పాత్రతో అలరించింది. తెలుగులో ప్రియమణికి ‘పెళ్లైన కొత్తలో’, ‘యమదొంగ’, ‘నవవసంతం’, ‘చారులత’.. వంటి సినిమాలు మంచి క్రేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. అప్పట్లో స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేసి అలరించింది.ప్రస్తుతం కూడా ప్రియమణి కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ  చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది.ఒకప్పడితో పోల్చితే ప్రియమణి ఇప్పుడు చాలా ఫిట్ గా, అందంగా మారిపోయిన విషయం తెలిసిందే. చూడటానికి చాలా యంగ్ గా కనిపిస్తూ.. లేటెస్ట్ అవుట్ ఫిట్లలో క్రేజీగా ఫొటోషూట్లు కూడా చేస్తున్నారు.ఇక తాజాగా ప్రియమణి చీరకట్టులో మెరిసింది. స్లీవ్ లెజ్ బ్లౌజ్, ప్రింటెడ్ శారీలో అట్రాక్ట్ చేసింది. లేటెస్ట్ శారీ లుక్ ను పరిచయం చేసింది. చీరకట్టులో ప్రియమణి మరింత అందంగా కనిపిస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com