నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా "అమిగోస్". రాజేంద్ర రెడ్డి డైరెక్షన్లో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుండి రీసెంట్గా టీజర్ విడుదలై సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది.అలానే లిరికల్ సాంగ్స్ కూడా ఆడియన్స్ నుండి మంచి స్పందన దక్కించుకుంటున్నాయి.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ అమిగోస్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు ఫిబ్రవరి 3వ తేదీన అమిగోస్ ట్రైలర్ విడుదల కాబోతుందని పేర్కొంటూ కాసేపటి క్రితమే మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లలో సందడి చెయ్యడానికి రెడీ అవుతుంది.