మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న చిత్రం "జిన్నా". కొత్త దర్శకుడు ఇషాన్ సూర్య డైరెక్షన్లో హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ నుండి మేకర్స్ కీ అప్డేట్ ఇచ్చారు.
అదేంటంటే, జిన్నా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం పదకొండు గంటలకు విడుదల చెయ్యనున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల విడుదలైన గోలీసోడా మాంఛి మాస్ మసాలా సాంగ్ గా క్లిక్ అయ్యింది.
కోన వెంకట్ ఈ మూవీకి రచయితగా పనిచేయగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మంచు విష్ణు నిర్మిస్తున్నారు.