ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"తలపతి 66" టైటిల్ పై క్లారిటీ వచ్చేది ఆ రోజే!

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 03:35 PM

టాలీవుడ్ డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ వంశీ పైడిపల్లి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో దిల్ రాజు కోలీవుడ్ నిర్మాణరంగంలోకి ప్రవేశిస్తున్నారు.
ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్మెంట్ పై ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి తెలుగులో వారసుడు, తమిళంలో వరిస్సు అనే టైటిల్స్ ను మేకర్స్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇదే టైటిల్‌ని విజయ్‌ పుట్టినరోజున అంటే జూన్ 22న అధికారికంగా ప్రకటిస్తారని టాక్. ఇటీవలే ఒక లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com