ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ గా 'F3' లోని 'లైఫ్ అంటే ఇట్టా వుండాలా' సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 18, 2022, 01:38 PM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న "ఎఫ్3" సినిమా మే 27, 2022న థియేటర్లలో రిలీజ్ కానుంది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం కోసం అందరు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో సిజ్లింగ్ బ్యూటీ పూజాహెడ్గే ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే నటించిన 'లైఫ్ అంటే ఇట్టా వుండాల' అనే పార్టీ సాంగ్ ని విడుదల చేసింది. ఈ పాటకు పూజా హెగ్డే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ఎనర్జిటిక్ సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్ మరియు గీతా మాధురి హై పిచ్ తో పాడారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, ప్రకాష్ రాజ్, సోనాల్ చౌహాన్, మురళీశర్మ, సంగీత, అంజలి ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com