అత్యాచారం కేసుల్లో 20 ఏళ్లు జైలు శిక్ష పడిన 50 రోజుల తర్వాత బాబా గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్ను చూడటానికి అతని భార్య హర్జీత్ కౌర్ రోహ్తక్లోని సునారియా జైలుకు వెళ్లింది. కుమారుడు జస్మీత్ ఇన్సాన్, కోడలు హుసన్ప్రీత్ ఇన్సాన్, కూతురు చరణ్ ప్రీత్, అల్లుడు రుహ్-ఏ-మీత్లతో కలిసి ఆమె వెళ్లారు. దీపావళి సందర్భంగా స్వీట్లు, చలికాలం వేసుకోవాల్సిన దుస్తులను కుటుంబ సభ్యులు గుర్మీత్కి ఇచ్చినట్లు సమాచారం. డేరా బాబాను తన కుటుంబం కలవడం ఇది మూడోసారి. శిక్ష పడిన తర్వాత తన చూడటానికి వచ్చే వారిలో పది మంది పేర్లను డేరా బాబాను జైలు అధికారులకు ఇచ్చాడు. ఆ పేర్లలో భార్య పేరు లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ ఆమెను కలవడానికి అనుమతించడంపై జైలు అధికారులను ప్రశ్నించగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.