ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డాన్స్ చేసిన రోజర్ ఫెదరర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2017, 01:58 PM

స్విస్‌ టెన్నిస్ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ రాకెట్ పక్కనపెట్టి కోర్టులో డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాని వివరాల్లోకి వెళ్తే చైనాలో షాంగైలో రోలెక్స్‌ మాస్టర్స్‌ ఎగ్జిబిషన్‌ టోర్నీ జరుగుతోంది. ఈ సందర్భంగా మ్యాచ్ ఆడేముందు 19 గ్రాండ్ స్లామ్ టోర్నీల విజేత రోజర్ ఫెదరర్ స్టేడియంలోకి వచ్చాడు. ఇంతలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు మిక్కీ మౌస్ వేషధారణలో ఉన్న వ్యక్తి ఫెదరర్ వద్దకు వచ్చి డాన్స్ చేయాలని కోరాడు. అతని కోరికమేరకు ఫెదరర్ డాన్స్ చేశాడు. ఈ వీడియోను ఏటీపీ టెన్నిస్ టీవీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ అవుతోంది. దిగ్గజానికి భేషజాలు లేవని అభిమానులు పేర్కొంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com