ఓ గ్రీకు వీరుడికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5000 మంది భామలు ప్రపోజ్ చేశారు. UKలో నివసిస్తున్న ముహమ్మద్ మాలిక్ (29) అనే కుర్రాడికి పెళ్లి వయసొచ్చింది. ఐతే అతనికి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదట. దీంతో జంట కోసం వినూత్నంగా వెతుకులాట ప్రారంభించాడు. బ్రిటన్ వీధుల్లో పెళ్లి చేసుకునేందుకు చక్కని అమ్మాయి కోసం వెతుకుతున్నట్టు వెడ్డింగ్ బోర్డులను పెట్టాడు. ఈ బోర్డుల్లో ‘అరెంజ్డ్ మ్యారేజ్ నుండి నన్ను రక్షించండి’ అని రాసి పెట్టాడు. అనంతరం… ఏకంగా 5000 మంది యువతుల నుంచి సంప్రదింపు లేఖలొచ్చాయట. ఐతే మహ్మద్ మాలిక్ డేటింగ్ యాప్ ప్రచారం కోసమే ఈ స్టంట్ చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలో కొచ్చాయి. అంతేకాదు సదరు వ్యక్తి ఇప్పటికే వివాహం చేసుకున్నాడని, #FindMalikAWife హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లుకొడుతోంది. ఇందుకోసం నెట్టింట ప్రత్యేక వెబ్‌పోర్టల్ findMALIKswife.comకూడా నడుస్తోందంటే ఆ వ్యక్తి పెళ్లి గోల ఏ రేంజ్లో దుమారం లేపివుంటుందో మీరే ఊహించండి.