వర్షాకాలం రానే వచ్చింది. కాకపోతే కొంత ఆలస్యంగా వర్షాలు పడుతున్నాయి. అయితే వర్షాకాలం ఏమోగానీ ఈ సీజన్లో అన్ని అంశాల పరంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది. ముఖ్యంగా రోడ్డుపై వెళ్లేటప్పుడు పక్కనే ఉండే కరెంటు స్తంభాలను చూసుకుని నడవాలి. పొరపాటున వాటికి తాకితే ఒక్కోసారి కరెంట్ షాక్తో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.