తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని మనస్తాపం చెందిన ఇద్దరు కూతుళ్లు కూడా అదే పని చేసిన విషాద ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు వల్లే వారు ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలిసింది. మయమ్మార్ కాలనీకి చెందిన బాబురెడ్డికి ఇద్దరు కుమార్తెల్లో పెద్దమ్మాయికి పెళ్లి జరిగింది. చిన్నమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోంది.
అయితే, పెద్దమ్మాయికి ఆమె భర్త నుంచి వేధింపులు ఎదుర్కొంది. దీంతో బాబురెడ్డి మనస్తాపం చెందాడు. పెద్ద అల్లుడి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. నిన్న రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తీవ్ర విషాదంలో ముగినిపోయిన బాబురెడ్డి ఇద్దరు కుమార్తెలు ఈ రోజు ఉదయం రైలు కింద ఆత్మహత్య చేసుకున్నారు.