ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను సవరించింది. తాజా వడ్డీరేట్లు నేటి (ఆగస్టు 14) నుంచే అమల్లోకి రానున్నాయి. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల వరుసగా నాలుగోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించిన నేపథ్యంలో ఐసీఐసీఐ వడ్డీ రేట్లను సవరించింది. ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలావధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను తగ్గించింది. ఇప్పటికే ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు వడ్డీరేట్లను ఈ నెలలోనే సవరించాయి.