నెల్లూరు నగరంలోని ఆరవింద్ నగర్ లో ఉన్న నారాయణ కాలేజ్ భవన గోడ కూలింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. భవనానికి సంబంధించిన గోడ అకస్మాత్తుగా కూలిపోవడంతో దీంతో పలువురు విద్యార్థులు గోడ శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు, కాలేజీ నిర్వాహకులు గాయపడ్డ విద్యార్థులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.