ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ-షికాగో విమానానికి బాంబు బెదిరింపు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 07:21 PM

ఇటీవల విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి షికాగో వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విమానాన్ని కెనడాకు మళ్లించారు. ఢిల్లీ నుంచి ఎయిరిండియాకు చెందిన ఏఐ127 విమానం షికాగో బయలుదేరింది. ఆ విమానానికి ముప్పు ఉందంటూ ఆన్‌లైన్‌లో దుండగులు పోస్టు పెట్టారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందుజాగ్రత్త చర్యగా కెనడాలోని ఇకాలూట్‌ ఎయిర్‌పోర్టులో విమానాన్ని ల్యాండింగ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com