ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హరికేన్ల దాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 11, 2017, 12:33 PM

హరికేన్లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇప్పటికే వరుసగా వచ్చిన హార్వే, ఇర్మాల కారణంగా అగ్రరాజ్యం భారీగా నష్టపోయింది. ఈ నష్టం మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు హరికేన్ల కారణంగా ఇప్పటి వరకు అమెరికా అక్షరాల 290 బిలియన్‌ డాలర్లు( రూ.18లక్షల కోట్లు) నష్టపోయింది. ఇది ఆ దేశ స్థూల జాతీయోత్పత్తిలో 1.5శాతానికి సమానం. ఇందులో ఇర్మా కారణంగా ఇప్పటికే 100 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. ఇది భవిష్యత్తులో మరింత పెరగవచ్చు. ఇటీవల వచ్చిన హార్వే హరికేను అమెరికా చరిత్రలోనే అత్యంత నష్టదాయకమైంది. ఈ హరికేను కారణంగా 190 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. ఇది అమెరికా జీడీపీలో ఒక శాతానికి సమానం. ప్రస్తుతం అమెరికా స్థూల జాతీయోత్పత్తి 19 ట్రిలియన్‌ డాలర్లు. ఈ విషయాన్ని ఆక్యూ వెదర్‌ అనే వాతావరణ సంస్థ తెలిపింది. వ్యాపార నష్టాలు, కోల్పోయిన ఉద్యోగాలు, దెబ్బతిన్న రవాణ , మౌలిక వసతుల, పంటనష్టం, ఇంధన ధరల పెరుగుదల, దెబ్బతిన్న ఇళ్లు, కోల్పోయిన విలువైన పత్రాల ఆధారంగా ఈ నష్టాన్ని లెక్కగట్టారు. వీటిల్లో అతితక్కువ మొత్తాన్ని మాత్రమే బీమా సంస్థలు భర్తీ చేస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com