కావలసిన పదార్ధాలు: కాచి చల్లార్చిన పాలు - 2 కప్పులు, పంచదార - 2 స్పూన్లు, రోజ్ సిరప్ - 2 స్పూన్లు, పుచ్చకాయ ముక్కలు , ఐస్ క్యూబ్స్ .
తయారీవిధానం:
-- ముందుగా చిక్కని పాలను కాచి చల్లార్చి , ఒక గంటసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచండి.
-- పంచదారను మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారుచేసి పెట్టుకోండి.
-- ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలను, మెత్తగా చేసుకున్న పంచదారను వేసి బాగా కలుపుకోవాలి.
-- మార్కెట్లో రోజ్ సిరప్ దొరుకుతుంది. అది రెండు స్పూన్లు పాలలో వెయ్యాలి.
-- కొన్ని ఐస్ క్యూబ్స్ ను కూడా వేసుకుని బాగా కలపాలి.
-- ఇప్పుడు పుచ్చకాయను తీసుకుని గింజలు లేకుండా చాలా చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
-- ఈ పుచ్చకాయ ముక్కలను, ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలలో వేసి కలుపుకోవాలి. అంతే పుచ్చకాయ షర్బత్ రెడీ.
-- ఒక సర్వింగ్ గ్లాస్ లోకి ఈ జ్యూస్ ను పోసుకుని, పైన కొన్ని పుచ్చకాయ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే లుక్ అద్దిరిపోతుంది.