దేశంలోనే అతి పెద్దదైన ఎస్ బీఐలో ఖాతా తెరవాలనుకుంటున్నారా?.. కానీ కరోనా కారణంగా బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారా? అయితే మీకిది శభవార్తే! బ్రాంచ్ కు వెళ్లకుండానే ఖాతా ప్రారంభించే అవకాశాన్ని బ్యాంకు కల్పించింది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే బ్యాంకుకు వెళ్లకుండానే ఇంట్లో నుంచే ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ మళ్లీ ఎస్బీఐ ఇన్‌స్టా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ సర్వీసులు లాంచ్ చేసింది. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు సులభంగానే ఎస్బీఐలో అకౌంట్ తెరవొచ్చు. దీని కోసం కస్టమర్లు యోనో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా స్మార్ట్‌ఫోన్ నుంచే పాన్ కార్డు, ఆధార్ కార్డు సాయంతో బ్యాంక్ ఖాతా తెరవొచ్చు. అంతే కాకుండా ఎస్బీఐ ఈ ఇన్‌స్టా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ తెరిచినవారికి రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డును అందిస్తోంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పాన్, ఆధార్ నెంబర్లు ఎంటర్ చేసి ఓటీపీ సబ్మిట్ చేసి, ఇతర వివరాలు ఎంటర్ చేసి ఖాతా తెరవొచ్చు. నామినేషన్ సౌకర్యాం కూడా ఉంది. అంతేకాకుండా ఎస్బీఐ ఇన్‌స్టా సేవింగ్ అకౌంట్ కలిగిన వారికి ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఎస్బీఐ క్విక్ మిస్డ్ కాల్ సర్వీస్ వంటి బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. అకౌంట్ తెరిచిన వెంటనే ట్రాన్సాక్షన్లు కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి ఖాతాలు తెరిచే వారు ఓపెన్ చేసిన వారు ఏడాది లోపు బ్యాంక్‌కు వెళ్లి కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.