ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పలు విధులలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం ప్రచారంలో ఉన్న ఆయనతో మేము సైతం అంటూ భార్య భాగ్య సీమ చౌదరి, కుమార్తె ఆకాంక్ష, వదినమ్మ సింగరాయకొండ సర్పంచ్ తాటిపర్తి వనజ, మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.