ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అపచారం.. శివలింగానికి టెంట్ తాళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 25, 2022, 04:29 PM

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ గోలింగేశ్వరస్వామి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయం లోపల ఉన్న శివలింగానికి టెంట్ తాళ్లను కట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పార్కింగ్ ప్రదేశంలో అధికారులు, వైసీపీ నేతలు శనివారం వైఎస్సార్ చేయూత పంపిణీ సభ నిర్వహించారు. సభ కోసం వేసిన టెంట్ కు సంబంధించిన రెండు తాళ్లను ఆలయం లోపల ఉన్న శివలింగానికి కట్టారు. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com