నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన కొత్త చిత్రం "హంట్". ఇందులో సీనియర్ హీరో శ్రీకాంత్, యంగ్ కోలీవుడ్ హీరో భరత్ శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీ టీజర్ నిన్న విడుదలైంది. ఇందులో సుధీర్ రెండు భిన్నమైన పాత్రలలో నటిస్తున్నారు. టీజర్ ఎంగేజింగ్ కంటెంట్ ను కలిగి ఉండడంతో ప్రేక్షకులు ఈ టీజర్ పట్ల విశేష ఆదరణను కనబరుస్తున్నారు. దీంతో యూట్యూబులో ఈ టీజర్ 2 మిలియన్ ప్లస్ వ్యూస్ తో ట్రెండింగ్ వీడియోస్ లో దూసుకుపోతుంది.
పోతే, ఈ సినిమాను మహేష్ సూరపనేని డైరెక్ట్ చేస్తుండగా, భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.