ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన తదుపరి సినిమా లొకేషన్‌ల వేటలో బిజీగా ఉన్న డైరెక్టర్ పరశురామ్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 12:41 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ స్టార్ హీరో ఇప్పటికే వెంకట్ ప్రభు మరియు విక్రమ్ కుమార్‌లతో సినిమాలకు సైన్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. చైతూ దర్శకుడు పరుశురామ్ తో ప్రాజెక్ట్‌ను ఖరారు చేసినట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. పరశురామ్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను ఇప్పటికే లాక్ చేసినట్లు సమాచారం. పరశురామ్ ప్రస్తుతం షూటింగ్ లొకేషన్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రానున్న ఈ సినిమా అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com