మహిళలు బరువు తగ్గాలనుకుంటారు. దానికోసం ఎన్నో ట్రై చేస్తుంటారు. డైట్, వ్యాయామం, గ్రీన్ టీ తాగడం, ఓట్స్ తినడం ఇలా ఎన్నో మార్పులు చేసుంటారు. అయితే బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించేది.. కొవ్వు పదార్థాలు.. ముఖ్యంగా ఆయిల్, నెయ్యి, వెన్న తగ్గించాలంటారు. కానీ ఇందులో ఎంత నిజం ఉంది..?
నిజానికి నూనె, నెయ్యి, బటర్లు మూడు కొవ్వు పదార్థాలే. అయితే శరీరంలోని క్యాలరీను బర్న్ చేయాలన్నా.. త్వరగా బరువు తగ్గాలన్నా ఆహారంలో కొన్ని రకాల కొవ్వులను చేర్చడం చాలా ముఖ్యం. అయితే తగిన మోతాదులో మాత్రమే ఈ కొవ్వులు తీసుకోవాలి. తీసుకొనే కొవ్వుల్లో ఉండే A, D, E విటమిన్లు క్యాలరీలను కరిగించి శరీరాన్ని నాజుగ్గా ఉంచేందుకు సహకరిస్తాయి.
వెన్న... నూనెకు ఇది మంచి ప్రత్యామ్నయం. దీనిని మితంగా తింటే ఎలాంటి కీడు చేయదు. వెన్నలో ట్రాన్స్ ఫ్యాట్స్ లేవు. వెన్నను పాల నుంచి సేకరించడం వల్ల విటమిన్ A, E, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం లభిస్తాయి. బటర్ శరీరానికి తక్షణ శక్తిని అందించే వనరుగా కూడా పనిచేస్తుంది. ఒక స్పూను వెన్నలో 100 క్యాలరీలు, 12 గ్రాముల కొవ్వులు ఉంటాయి.
అలాగే ఆలివ్ నూనె ఎంతో ఆరోగ్యకరమైనది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. ఈ నూనెలో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. MUFA.. కొవ్వుకు ఆరోగ్యకరమైన మూలం, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెలో 119 క్యాలరీలు, 13.5 గ్రాముల కొవ్వు ఉంటుంది.
నెయ్యి తింటే బరువు పెరిగిపోతారని చాలా మంది భావిస్తారు. కానీ ప్రపంచమంతా ఇప్పుడు దీన్ని బరువు తగ్గించే పదార్థాల్లో ఒకటిగా తీసుకుంటోంది. కొవ్వును కరిగించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. విటమిన్ A, D, K నెయ్యిలో అధికంగా ఉంటాయి. నెయ్యిలో కేసైన్ ఉండదు. ఒక చెంచా నెయ్యిలో 115 క్యాలరీలు, 9.3 గ్రాముల సంతృప్త కొవ్వు, 0 పిండి పదార్థాలు, 38.4 గ్రాముల కొవ్వులు ఉంటాయి.
అయితే బరువు తగ్గడమే లక్ష్యమైతే ఈ మూడిట్లో ఒకటి మాత్రమే వినియోగించడం మంచిది. ఈ మూడింటిని పోల్చితే.. ఆలివ్ ఆయిల్ తీసుకోవడమే ఉత్తమ మార్గం. వెన్న, నెయ్యిలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.