బ్రిటన్ కు చెందిన 29 ఏళ్ల సోఫీ బగ్ రికార్డు సృష్టించారు. ఎలాంటి పురుటి నొప్పులు లేకుండా కేవలం 27 సెకండ్లలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. హాంప్షైర్లో నివసిస్తున్న సోఫీ బగ్ నిండు గర్భిణి. ఇటీవల అర్థరాత్రి ఆమె బాత్ రూమ్ కు వెళ్లగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో సాయం కోసం భర్తను పిలిచింది. వచ్చి చూసిన భర్త క్రిస్ కు తన భార్యకు సరికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయని అర్థం అయింది. భర్త సూచనతో ఒక్క పుష్ ఇచ్చింది. దీంతో 27 క్షణాల్లోనే బిడ్డ బయటకు వచ్చింది. అయితే సోఫీ బగ్ ఇలా వేగంగా బిడ్డకు జన్మనివ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో తొలి బిడ్డను 12 నిమిషాల్లోనే ప్రసవించగా రెండో ప్రసవం 26 నిమిషాల్లో జరిగిపోయింది. తాజాగా మూడో బిడ్డను కేవలం 27 సెకెండ్లలోనే ప్రసవించి రికార్డు సృష్టించింది. సాధారణంగా బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి పడే ప్రసవ వేదన అంతా అంతా కాదు. కొన్ని సార్లు ఈ నొప్పులు గంటల తరబడి ఉంటాయి.