ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 29 వేల ఫోన్ రూ. 23 వేలకే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 02:16 PM

స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ బిగ్ సేవింగ్ డేస్ సేల్ జూన్ 23 నుంచి జూన్ 27 వరకు నిర్వహించనుంది. ఈ సేల్స్ లో భారీ ఆఫర్లను అందించనుంది. ఎప్పట్లాగే స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్ సంస్థ. ఏఏ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.


-రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ అసలు ధర రూ.26,999 కాగా హెచ్‌డీఎఫ్‌సీ డిస్కౌంట్‌తో రూ.23,499 ధరకే సొంతం చేసుకోవచ్చు.


-వివో జెడ్1 ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ మోడల ధర రూ.16,990 కాగా ఆఫర్ ధర రూ.14,990.


-రియల్‌మీ ఎక్స్‌2 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ అసలు ధర రూ.31,999 కాగా రూ.4,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌తో రూ.27,999 ధరకే పొందవచ్చు.


-ఎంఐ మిక్స్ 2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ అసలు ధర రూ.19,999 కాగా ఆఫర్లో రూ.14,999కు పొందవచ్చు.


-వివో నెక్స్ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ అసలు ధర రూ.29,990 కాగా ఆఫర్ లో రూ.23990కే పొందవచ్చు.


-ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ 6జీబీ+128జీబీ అసలు ధర రూ.38,990 కాగా ఆఫర్ లో రూ.26,990కే పొందవచ్చు.


-యాపిల్ ఐఫోన్ 8 స్మార్ట్‌ఫోన్ 64జీబీ వేరియంట్ అసలు ధర రూ.38,999 కాగా, ఆఫర్లో రూ.36,999కే సొంతం చేసుకోవచ్చు.


-యాపిల్ ఐఫోన్ 7 స్మార్ట్‌ఫోన్ 32జీబీ వేరియంట్ అసలు ధర రూ.29,499 కాగా ఆఫర్లో రూ.28,499కే సొంతం చేసుకోవచ్చు.


-యాపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్ స్మార్ట్‌ఫోన్ 64జీబీ ధర రూ.62,999 కాగా ఆఫర్లో రూ.58,999కే పొందవచ్చు.


-మోటోరోలా వన్ ఫ్యూజన్+ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999 కాగా ఈ ఫోన్ ఫ్లాష్ సేల్‌లో అందుబాటులో ఉంచారు.


-టెక్నో స్పార్ట్ పవర్ 2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ ధర రూ.9,999 కాగా ఈ ఫోన్ ఫ్లాష్ సేల్‌లో అందుబాటులో ఉంచారు.


ఈ అన్ని ఫోన్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనుంది. కస్టమర్లకు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్స్ లాంటి అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com