అనంత జిల్లా కంబదూరు మండలంలోని కదిరిదేవరపల్లిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అచ్చంపల్లికి చెందిన వాలంటీర్ ఉప్పర తిమ్మరాజు మృతిచెందాడు. కళ్యాణదుర్గంలో గురువారం జరిగిన సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన టాటా సుమో ఢీకొంది. ప్రమాదంలో తిమ్మరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.