ప్రతిష్టాత్మక తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ (TAS) హైదరాబాద్ పరిశోధన మరియు అకాడమిక్ రంగంలో సేవలందించినందుకు గాను ప్రతి సంవత్సరం ఫెలోగా, అసోసియేట్ ఫెలో గా, యంగ్ సైంటిస్టులుగా ఎన్నిక కాబడ్డ సభ్యులను సన్మానించడం జరుగుతుంది. ఈ సందర్భంగా 2021వ సంవత్సరము గాను సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలోని కెమిస్ట్రీ విభాగాధిపతి అయిన డాక్టర్ వాసం శ్రీనివాస్ అసోసియేట్ ఫెలో గా ఎన్నిక కావడం జరిగింది. తన సర్వీస్ కాలంలో దాదాపు 25 పరిశోధన వ్యాసాలను మరియు తెలుగు అకాడమీ మరియు ఇతర ఐఎస్బిఎన్ చెందిన పదికి పైగా టెక్స్ట్ బుక్స్ లో 30 కి పైగా చాప్టర్స్ వ్రాయడం జరిగింది. అకాడమిక్ లో సేవలందించినందుకు గాను అసోసియేట్ ఫెలో గా ఎన్నికైనందుకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్ ప్రసాద్ మరియు కళాశాల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం వారిని ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. హుస్సేన్, అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ గోపాల సుదర్శన్, పీజీ కోఆర్డినేటర్ డాక్టర్ పి. అయోధ్య రెడ్డి, ఐపిఎస్సి కోఆర్డినేటర్ డాక్టర్ పి. మధుసూదన్ అకాడమిక్, కోఆర్డినేటర్ కె భవాని కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు ఆంజనేయులు, డాక్టర్ జి రవికుమార్, డాక్టర్ పి సుమలత, ఎం శ్యాంసుందర్, ఎండి సలీం పాషా, వి. బాలకిషన్ మరియు మైక్రో బయాలజీ విభాగ్యపతి డాక్టర్ పి పల్లవి, తెలుగు విభాగాధిపతి డాక్టర్ ఎస్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |