గోవాలో అత్యధిక సీట్లు సాధించబోతున్న పార్టీగా బీజేపీ నిలిచింది. దీంతో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం దాదాపు ఖాయం. ఈ నేపథ్యంలో గోవా సీఎంగా ఎవరు ఎన్నికవుతారు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్న ప్రమోద్ సావంత్ ఈసారి కూడా ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఇప్పటికే సావంత్.. సాంకెలిమ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణం తర్వాత, ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.